హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 2న కబడ్డీ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో అక్టోబర్ 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి తాడంకి జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో కబడ్డీ జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షడు కేవీ నాంచారయ్య తెలిపారు. బాలురు 75 కేజీల లోపు, బాలికలు 65 కేజీల లోపు బరువు ఉండాలన్నారు. క్రీడాకారులు తమ ఒరిజనల్ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.