హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతల రోడ్డు.. రాకపోకలకు ఇబ్బందులు

SRPT: హుజూర్‌నగర్–వేపల సింగారం మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ రహదారి అధ్వానంగా మారి మోకాలి లోతు గుంతలు ఏర్పడ్డాయి. వర్షానికి గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బ్రిడ్జి పనులకు గడువు ప్రకటించి, ప్రత్యామ్నాయ రహదారిని వెంటనే బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.