MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన మంజూరు ఉత్తర్వుల ప్రతిని ఆదివారం కుల సంఘం ప్రతినిధులకు అందజేశారు. కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేసిన ఎంపీకి కుల సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
లక్ష్మాపూర్ మాల కమ్యూనిటీ హాల్‌కు రూ.10 లక్షలు మంజూరు


