MNCL: బెల్లంపల్లి పట్టణం 19వ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగునీరు రోడ్ పైకి వస్తోంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహించడం వల్ల దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్ పైకి మురుగునీరు


