ADB: భగత్ సింగ్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని చించుఘాట్ గ్రామంలో భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన నాయకుడని కొనియాడారు.
తెలంగాణ
భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో ఉద్యమించాలి: PDSU


