ASR: ముంచంగిపుట్టు మండలం గూడమాలిపుట్టులో వర్షాలకు పెంకుటిల్లు కూలి సూర్యనారాయణ (56)మృతి చెందారు. భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో, శిథిలాల నుంచి గ్రామస్థులు ఆయనను బయటకు తీశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఆదివారం ఎస్సై పీ.నాని సందర్శించి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలకు ఇల్లు కూలి వ్యక్తి మృతి


