హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ పాటలు ప్రతి ఇంటా మార్మోగాలి: కవిత

HYD: ప్రకృతిని, పూలను పూజించే బతుకమ్మ పండుగలో బతుకమ్మ పాటలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని తన పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉదయం ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిరునామా అని అన్నారు. తెలంగాణ జాగృతి ఏటా పాటలను రికార్డు చేసి అందిస్తోందని, మన సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షించారు.