హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొలనుకొండకు బస్సు నడపాలని వినతి

GNTR: కొలనుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సు నడపాలని బాలల పార్లమెంట్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యులు కోరారు. విద్యార్థులు, ఉద్యోగులు నగరాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బైపాస్‌ వద్ద దిగిన తర్వాత గ్రామాలకు చేరుకోవడం కష్టంగా ఉందన్నారు. ఉదయం, సాయంత్రం రెండేసి ట్రిప్పులు నడపాలని డిపో మేనేజర్‌కు ఇవాళ విన్నవించారు.