ప్రకాశం: గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లి పంచాయతీ పరిధిలోని జమ్ముళ్లపల్లిలో జ్వరాలతో పలువురు అనారోగ్యానికి గురికావడం, ఇద్దరు మృతి చెందిన ఘటనపై MLA అశోక్ రెడ్డి స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచి, అవసరమైన పరీక్షలు, చికిత్సలు వెంటనే అందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జ్వరాలతో ఇద్దరు మృతి.. అప్రమత్తమైన MLA


