హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనిషి పాదాన్ని పోలిన అరుదైన ఎల్లరి గడ్డ దుంప.!

NZB: వర్నిలోని జలాల్‌పూర్‌లో ఓ అరుదైన ఎల్లరి గడ్డ దుంప స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన రైతు ఓల్లెపు రాములు తన పొలంలో ఎల్లరిగడ్డ తీగను తవ్వగా,భూమిలో నుంచి మనిషి పాదాన్ని పోలిన ఆకారంలో భారీ దుంప బయటపడింది. ఈ దుంప సుమారు మీటరు పొడవు, 8 కిలోల బరువు ఉన్నట్లు రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. సహజంగా ఏర్పడిన దుంప ఆకారం అచ్చం మనిషి పాదంల ఉంది.