హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలతో పెరుగుతున్న ప్రమాద ముప్పు

NTR: తిరువూరులోని ప్రధాన రహదారులు భారీ వర్షాలతో లోతైన గుంతలతో ప్రమాదకరంగా మారాయి. బస్టాండ్ రోడ్, ఆల్ఫా హోటల్ సమీపం, ఎంపీడీవో కార్యాలయం ముందు, సాయిబాబా గుడి రోడ్డులో నవత ట్రాన్స్‌పోర్ట్ వద్ద గుంతలు వాహనదారులకు, ముఖ్యంగా రాత్రివేళల్లో, తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.