కర్నూలు: ఆదోనిలో పెట్రోల్ దాడికి గురైన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ నెల 6న ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన నరసమ్మ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ దాడికి గురైన కార్మికురాలు మృతి


