హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల స్థాపన, పురోగతిపై మంత్రి సమీక్ష

కర్నూలు కలెక్టరేట్‌లో పరిశ్రమల స్థాపన, నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొన్నారు. పారిశ్రామిక వర్గాల సమస్యలు, పెండింగ్ అంశాలపై పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు.