హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి'

KNR: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అధికారులు పనిచేయాలని సూచించారు.