హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

MHBD: జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. SP డా. శబరీశ్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక అన్యాయం, పెత్తందారీ దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం, ధైర్యం, ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.