BDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత పాటిస్తూ, అవినీతికి తావులేకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ విజిలెన్స్ అధికారి పి.బలరాం సూచించారు. శనివారం ఐడీఓసీలో ఏఈలతో సమీక్ష నిర్వహించి నిర్మాణాల పురోగతి, నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులు ఎవరికీ లంచం ఇవ్వకూడదని అవగాహన కల్పిస్తూ అధికారులతో ప్రమాణం చేయించారు. లంచం అడిగితే సమాచారం అందించాలని ఆయన కోరారు.
తెలంగాణ
'లంచాలు ఇవ్వొద్దని లబ్ధిదారులకు సూచన'


