హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీలో మోడల్ స్కూల్ బాలికల సత్తా

SDPT: ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అండర్‌–17, అండర్‌–14 బాలికల కబడ్డీ పోటీల్లో జగదేవ్‌పూర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు సత్తా చాటారు. అండర్‌–17 ఫైనల్‌లో హుస్నాబాద్ జట్టుపై విజయం సాధించి ప్రథమ స్థానం, అండర్‌–14లో మర్కూక్ జట్టుపై పోటీపడి ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థినులను అభినందించారు.