హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండాయి జంపన్నవాగుపై పడవ ఏర్పాటు

MLG: ఏటూరునాగారం మండలం కొండాయి వద్ద జంపన్నవాగులో వరద ప్రవాహం పెరగడంతో మల్యాల, కొండాయి, గోవిందరాజు కాలనీ గ్రామాల ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా మారాయి. దీంతో అధికారులు వాగుపై పడవ ఏర్పాటు చేశారు. అత్యవసర పనుల కోసం గ్రామస్తులు పడవపై వాగు దాటి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. తాత్కాలిక రోడ్డు లేక నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.