హైదరాబాద్: 28°C
తెలంగాణ

మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకున్న MLA సత్యం

KNR: కరీంనగర్‌లోని ఇందిరాభవన్‌లో మాజీ ప్రధానమంత్రి, డా. మన్మోహన్ సింగ్ జయంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.