JN: చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో వర్షాలకు నాని శనివారం పెంకుటిల్లు ఒక్కసారిగా కూలిపోయింది. కుటుంబ సభ్యులు అన్నం తింటుండగా జరిగిన ఘటనలో తమ్మ రమేష్ గాయపడ్డాడు. మిగతా కుటుంబ సభ్యులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో కుటుంబం నిలువ నీడ కోల్పోయింది. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని బాధిత కుటుంబం కోరుతోంది.
తెలంగాణ
కూలిన ఇల్లు.. నిలువ నీడ కోల్పోయిన కుటుంబం


