హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.1.01 లక్షల కలప సీజ్‌.. కేసు నమోదు

MHBD: అటవీశాఖ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.01 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. శనివారం బయ్యారం మండలం భీమ్లాతండాలో తనిఖీలు నిర్వహించి రూ.57,059 విలువైన 0.3674 సీఎంటీ టేకు కలప, రూ.43,996 విలువైన 0.4436 సీఎంటీ నాన్‌-టేకు కలపను సీజ్‌ చేశారు. మొత్తం కలప విలువ రూ.1,01,055గా అధికారులు తెలిపారు.