హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికపై లైంగిక దాడి.. యువకుడి అరెస్ట్

VKB: బషీరాబాద్ మండలంలో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.