హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ సిబ్బందికి క్రీడా సామాగ్రి పంపిణీ

NGKL: రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలకు ఎంపికైన సిబ్బందికి జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణ, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు ప్రతిభ చాటి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.