హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య విద్యార్థినికి రూ.లక్ష సాయం

RR: వెల్దండ మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని సరిత వైద్య విద్యలో సీటు సాధించింది. ఆమె చదువుకు అండగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన సరితను తల్లి దినసరి కూలీగా పనిచేస్తూ చదివిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలని రాఘవేందర్‌రెడ్డి కోరారు.