హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

NGKL: నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీలకు జిల్లా నుంచి క్రీడాకారులను పంపిస్తున్నట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు. అసోసియేషన్ ఛైర్మన్ మేకల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, జాయింట్ సెక్రెటరీ సంజు కుమార్ పాల్గొన్నారు.