హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు స్పీకర్ నివాళులు

VKB: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ఆయన స్మరించుకున్నారు. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.