WNP: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో విగ్రహాల చోరీ జరిగింది. శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయ తాళాలు తెరిచి చూడగా విగ్రహాలు కనిపించకపోవడంతో అర్చకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీరంగనాయక ఆలయంలో విగ్రహాల చోరీ


