WNP: జిల్లా పోలీస్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ డి. సునీత రెడ్డి ఐపీఎస్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతాంగ హక్కులు, భూమి హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


