హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సైతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

RR: జిల్లాలోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళా ఎస్సైతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్మాస్‌గూడలో గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా ఎస్సైతో సాకేత్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. ఆమె ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.