హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాస్క్‌ఫోర్స్ దాడులు.. రూ.1.75 లక్షల బియ్యం పట్టివేత

WGL: నెక్కొండ మండలం పనికరలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. గర్నపల్లి జితేందర్‌రెడ్డి ఇంట్లో 50 క్వింటాళ్ల పీడీఎస్ బ్రోకెన్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.75 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ సీఐ సుబ్బా రెడ్డి తెలిపారు. కేసు నమోదు నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.