హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ పోరాటం ఆదర్శనీయం: మున్సిపల్ ఛైర్మన్

NRPT: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మక్తల్‌ పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఆమె విగ్రహానికి మున్సిపల్‌ ఛైర్‌‌పర్సన్‌ వాకిటి మానస శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ఐలమ్మ చేసిన పోరాటం ఆదర్శనీయమని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.