JN: బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో కోతుల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. కోతులతో నష్టపోతున్న గ్రామస్తులు వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక బోనులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.500 చొప్పున విరాళాలు సేకరించి బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒకేరోజు 130 కోతులు బోనులో చిక్కుకున్నాయి.
తెలంగాణ
ఫలించిన గ్రామస్తుల చర్యలు


