MDCL: మేడ్చల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన సద్ది సంజీవరెడ్డి ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా, కంటైనర్ వాహనం బైక్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ విధుల్లో లేకపోవడంతోనే ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు.
తెలంగాణ
బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్.. వ్యక్తికి గాయాలు


