హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

BHPL: భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఆమె స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.