ASF: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని రెబ్బెన మండల తెలంగాణ ఉద్యమకారులు కోరారు. ఈ సందర్భంగా శనివారం రెబ్బెన మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రవీందర్, బాబురావు పాల్గొన్నారు.
తెలంగాణ
'తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి'


