NLG: చిట్యాల మండలం వెలిమినేడులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్‌లు 93, 94, 95, 97లో అనుమతులు, పర్యావరణ క్లియరెన్స్ పత్రాలు లేకుండానే నిర్మాణం జరుగుతోందని వారు పేర్కొన్నారు. వెల్ది రాఘవరెడ్డి, గోలి అరవింద్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఆర్‌ఎంసీ ప్లాంట్ నిర్మాణం ఆపాలీ'


