హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సహారా బాధితులకు న్యాయం చేయాలి'

HNK: సహారా ఇండియా సంస్థలో డిపాజిట్‌ చేసి మోసపోయిన బాధితులకు పూర్తి సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని సహారా బాధితుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. శనివారం హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో బాధితులు, ఏజెంట్లు కలిసి ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్పందించి జాతీయ బ్యాంకుల ద్వారా డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరారు.