NLG: నిడమనూరు మండలంలోని గుంటుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం పొలంలో మందు కొడుతున్న నల్లగంతల నాగరాజు (27)కు ఇటీవల గాలివానకు తెగిపడిన 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై విజయ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


