హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయం: డీఆర్వో

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి టీఏవీ నాగలక్ష్మి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయమని, ఆమె ధైర్యసాహసాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.