హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఉత్తమ గురువుగా సబీహా ఎంపిక

VKB: పట్టణంలోని కేజీబీవీలో ఉర్దూ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సబీహా సుల్తానా జిల్లా ఉత్తమ గురువు అవార్డుకు ఎంపికయ్యారు. 2010 నుంచి విద్యార్థినుల విద్యాభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని సబీహా తెలిపారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.