హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్ఎండీకి కొనసాగుతున్న భారీ నీటి ప్రవాహం

KNR: కరీంనగర్ ఎల్ఎండీ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 12.539 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు నుంచి 18 వేల క్యూసెక్కులు, రివర్ నుంచి 654, కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి 571 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లికి భారీ వరద చేరడంతో మిడ్మానేరు వైపు నీటిని ఎత్తిపోస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది.