హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కళాశాలలో మైనారిటీ సంక్షేమ అధికారి తనిఖీలు'

KMM: కారేపల్లి మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌, స్టాక్‌ రిజిస్టర్‌, ఆహార పట్టిక, పదార్థాలు, తరగతి గదులు, మూత్రశాలలు, డార్మెటరీలను పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు.