హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి

GDWL: గద్వాల కేంద్రంలోని శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని, అన్నదానం కార్యక్రమానికి హాజరై భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ కమిటీ డైరెక్టర్ రాధా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.