హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వాగు దాటుతుండగా ప్రమాదం

BHPL: టేకుమట్ల మండలం ద్వారకాపేటకు చెందిన చిటికెల రవీందర్‌రెడ్డి పెన్షన్‌ కోసం ఎంపేడు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగులో గల్లంతయ్యాడు. శనివారం నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలంలో ఆయనకు చెందిన లుంగీ, టవల్‌ లభించాయి. ప్రస్తుతం గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.