హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి

MDCL: పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో యంనంపేట బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న బీటెక్ విద్యార్థి కిషోర్ (20) మృతి చెందాడు. మరో యువతి విజయ తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లికి చెందిన కిషోర్ బీఎన్ రెడ్డినగర్‌లో ఉంటూ ఇబ్రహీంపట్నంలోని ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.