హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

MDK: రామాయంపేట మండలంలోని ఆర్ వెంకటాపూర్‌ గ్రామంలో వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ ఉమ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని సర్పంచ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.