హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్ల కొమ్మల్లో విద్యుత్ తీగలు

SRPT: గోపాలపురం‌లోని వీధుల వెంట ఉన్న చెట్లు విద్యుత్ తీగల్లోకి అల్లుకుపోయినా, పాలకవర్గం, సంబంధిత విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గాలిదుమ్ములు వచ్చినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే చెట్ల కొమ్మలను తొలగించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.