హైదరాబాద్: 28°C
తెలంగాణ

FBO నవీన్ కుటుంబానికి అండగా ట్రస్ట్

BDK: కొత్తగూడెం మండలం, చెరువుసింగారం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన FBO నవీన్ కుటుంబానికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ బెనివోలెంట్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. కుటుంబానికి మొత్తం రూ.2 లక్షలు మంజూరు చేయగా, తొలి విడతగా రూ.లక్ష సాయం పత్రాన్ని DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్ నవీన్ తండ్రికి అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.