హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రి పొంగులేటి సభలో మహిళల నిరసన

జనగామ జిల్లాలో నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగిస్తుండగా ఇందిరమ్మ చీరలు ధరించిన కొందరు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్‌ రూ.4 వేలు చేస్తామన్న హామీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అంశాలపై మంత్రిని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిజమైన పేదలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.