హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినికి మెమెంటో అందజేసిన ట్రైనీ కలెక్టర్

GDWL: చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఉదండాపురం పాఠశాలలో జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అమరవాయి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని ఇందు ప్రథమ బహుమతి సాధించింది. ఇందులో భాగంగా నేడు జిల్లా ట్రైనీ కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ చేతుల మీదుగా పాఠశాలలో ఆమెకు మెమెంటో, నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.